Trending
విజయం సాదించాలంటే ....ఓడిపోతానన్న భయం కన్నా , గెలవాలన్న తపన ఎక్కువగా ఉండలి.


Wednesday, 11 June 2014

Brief Description for Koratla City, The Ideal City


                                 



History :
koratla google map

ఇంతకుముందు ఈ వూరి పేరు "కొరవట్టు" లేదా "కొరవట్లు" అనీ, నిజా పాలన కాలంలో "కోరుట్ల"గా రూపాంతరం చెందిందనీ అంటారు. కోరుట్ల కోనేరులో క్రీ.శ.1042-1068 కాలంనాటి శిలాశాసనం లభించింది.
దీని ప్రకారం కోరుట్లకు వేయి సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్నదని తెలుస్తుంది. జైనులు, కళ్యాణి చాళుక్యులు , వేములవాడ చాళుక్యులు , రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని వివిధ దశలలో పాలించారు.

ఈ పట్టణం కోట చారిత్రికంగా ఆరు బురుజుల మధ్య నిర్మించబడిందని అంటారు. వాటిలో ఐదు బురుజులు ఇప్పటికీ ఉన్నాయి. ఈ బురుజులను కలిపే పెద్ద గోడ ఉండేది. ఆ గోడపై ఒక కారు వెళ్ళవచ్చును. గోడ వెలుపల మరింత రక్షణ కోసం ఒక కందకం ఉండేది. ఆప్రాంతం ఇప్పటికీ "కాల్వగడ్డ" అని పిలువబడుతుంది. కోట మధ్య ఆవరణలో రాతి గట్టులతో త్రవ్వబడిన ఒక కోనేరు ఉంది. అక్కడి వెంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి. చూడ దగినవ

TEMPLES of KORATLA: ి కోరుట్లలో సాయిబాబా మందిరం, అయ్యప్ప గుడి, నాగేశ్వరస్వామి గుడి, రామాలయం, వెంకటేశ్వరస్వామి గుడి , అష్టలక్ష్మి దేవాలయం వంటి పలు మందిరాలు ఉన్నాయి. దేవీ నవరాత్రులు, దీపావళి, శ్రీరామనవమి , సంక్రాంతి వంటి పండుగలు ఘనంగా విర్వహిస్తారు.






Korutla map of Telangana
శ్రీ మార్కండేయ మందిరం నిజాం కాలంలో, 1925లో కట్టబడింది. ఇటీవల అదే స్థలంలో కోటి నవదుర్గాశివ మార్కండేయ మందిరం నిర్మించారు. ఈ నిర్మాణంలో కోటి దుర్గామాత ప్రతిమలను వాడారు. ఆ ప్రక్కనే శివమార్కండేయ మందిరాన్ని కట్టారు. ప్రతి సంవత్సరం ఇక్కడ దేవీ నవరాత్రి మహోత్సవాలను పెద్దయెత్తున నిర్వహిస్తారు.

Koratla Sai Baba Temple :





కోరుట్ల బస్స్టాండుకు 2 కి.మీ. దూరంలో కోరుట్ల వాగు (సాయిరాం నది) వడ్డున సాయిబాబా గుడి కట్టారు. 20 ఎకరాల స్థలంలో కట్టబడిన ఈ అందమైన మందిరాన్ని అక్కడ రెండవ షిరిడి అంటారు. షిరిడిసాయి పుణ్యతిథినాడు వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి సాయిబాబాను దర్శించుకొంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక గ్రంధాలయం, ఫంక్షన్ హాల్, ధర్మశాల, ధునిశాల, అర్చకుల గృహాలు, ఇతర నిర్వాహక భవనాలు ఉన్నాయి. 
Images of Temple
 




కోరుట్ల కు 5 కి.మీ. దూరంలో నాగులపేట గ్రామం వద్ద పెద్ద సైఫన్ (ఆసియాలో రెండవ పెద్దది కావచ్చును [1] ) ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ కోరుట్ల వాగును క్రాస్ చేయడానికి వీలుగా అండర్గ్రౌండ్ కల్వర్ట్ నిర్మించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కాలువ నీరు కోరుట్ల వాగులు లంబంగా ప్రవహించి సైఫన్ ద్వారా బయలువెళుతుంది. 1953-1973లో కట్టబడిన ఈ సైఫన్ విశిష్టమైన డిజైను చేసిన ఇంజినీరు పేరుమీద దీనిని "పి.ఎస్.రామకృష్ణరాజు సైఫన్" అంటారు.

కోరుట్లకు 7 కి.మీ. దూరంలో పైడిమడుగు వద్ద పెద్ద మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టు 7 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇది 200 సంవత్సరాల పైబడిన వృక్షమని

కోరుట్ల :
కోరుట్ల సమీపంలో వేములవాడ వెళ్లేదారిలో ఉన్న "అల్లమయ్య గుట్ట" అనే చిన్న కొండపై ఒక గుడి , ఒక మసీదు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇది మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తారు. అల్లమయ్య గుట్టపైన అయ్యప్ప గుడి, జ్ఞాన సరస్వతి గుడి ఉన్నాయి. అయ్యప్ప గుడిని రెండవ శబరిమల అంటారు. నవంబరు-డిసెంబరు మాసాలలో అయ్యప్ప దీక్ష, భజన, అయ్యప్ప జాతర వంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. అయ్యప్ప గుడి ప్రక్కనే పెద్ద మసీదు ఉంది. రంజాన్ , బక్రీద్ వంటి ప్రత్యేక దినాలలో ఇక్కడికి పెద్దసంఖ్యలో ముస్లింలు వచ్చి ప్రార్ధనలు చేస్తారు.



ఇంకా కోరుట్ల సమీపంలో వేములవాడ (45 మైళ్ళు), ధర్మపురి (30 మైళ్ళు), కొండగట్టు (20మైళ్ళు) వంటి ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి.

సౌకర్యాలు : Koratla Facilities :

విద్య Education of Koratla
: వందల సంవత్సరాలుగా కోరుట్ల ఒక విద్యాకేంద్రంగా వర్ధిల్లింది. సేనాపతి నృసింహాచారి అనే పండితుడు ఇక్కడ కాళ్వగడ్డ వద్ద ఒక సంస్కృత పాఠశాలను, వేదపాఠశాలను నెలకొలిపాడు.


Some Of Historical Images
                                           KORATLA GADDI GURUJU






SIPHON OF KORATLA





koratla MUNICIPALITY







కోరుట్లలో ఉన్న విద్యాలయాలు :


And More .

THIS TOWN IS BECOME AS CONSTITUENCY AND MANY FACILITIES ARE AVAILABLE



Tags: Koratla greatness, Beauty of Koratla, Korutla Constituency, Korutla Mandal karimnagar, Ranjith Koratla, karimnagar district Koratla Mandal, Koratla Sai baba Temple, KORATLA TEMPLES, HISTORY OF KORATLA



Writing By - Ranjith Bandi


.


No comments:

Post a Comment

About

Popular Posts

Designed By Blogger Templates