రెండో ఆపిల్ పండు:-
రాజేష్ : న్యూటన్ ఆపిల్ పండు కింద పడగానే కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి నువ్వైతే.గిరీష్ : పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా ... అని ఆలోచిస్తాను.
నమ్మకం:-
"ఏదమ్మా.. ఈ బెడ్ మీద పడుకో. పరీక్ష చేస్తాను" అన్నాడు డాక్టర్ మన్మధరావు."మనతో పాటు మీ నర్స్ కూడా ఉంటే బాగుంటుంది డాక్టర్..." అన్నది కామేశ్వరి.
"అదేంటమ్మా.... నామీద నమ్మకం లేదా?" బాధగా అన్నాడు డాక్టర్.
"మీ మీద కాదండి. బయటున్న మాఆయనకు నా మీద నమ్మాకం లేదు" చెప్పింది
అందంగా కన్పించాలని:-
రమేష్ : పడుకునేముందు షోగ్గా తయారయి పడుకుంటున్నావు.వివేక్ : కలలో కన్పించే అమ్మాయిలకు అందంగా కన్పించాలని ..