Trending
విజయం సాదించాలంటే ....ఓడిపోతానన్న భయం కన్నా , గెలవాలన్న తపన ఎక్కువగా ఉండలి.


Thursday, 16 January 2014

వీరేంద్ర సెహ్వాగ

భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు
వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) వీరేంద్ర సెహ్వాగ
అక్టోబర్ 20, 1978 రోజున జన్మించాడు.
వీరూ అని ముద్దుగా పిల్వబడే ఇతను
1999 నుంచి వన్డే, 2001 నుంచి
టెస్టులకు భారత జట్టులో
ప్రాతినిద్యం వహిస్తున్నాడు. కుడిచేతి
వాటం గల ఈ బ్యాట్స్మెన్, బౌలింగ్ కూడా
చేయగలడు. భారత జట్టు తరఫున టెస్ట్
క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత
స్కోరు (319) సాధించిన బ్యాట్స్మెన్గానే
కాడు, భారత్ తరఫున ఏకైక ట్రిపుల్ సెంచరీ
వీరుడు ఇతను. 2005 అక్టోబర్లో రాహుల్
ద్రవిడ్ నేతృత్వంలోని భారత
జట్టుకు ఇతను ఉప సారథిగా
నియమించబడ్డాడు. 2006 డిసెంబర్లో
వి.వి.యెస్.లక్ష్మణ్కు బదిలీ చేశారు. 2007
జనవరిలో భాతర వన్డే జట్టు నుంచి ఇతని
పేరు తొలిగించారు. [1] 2007- 08 ఆస్ట్రేలియా
పర్యటనకై మళ్ళీ ఎంపికై అడిలైడ్ టెస్ట్
రెండో ఇన్నింగ్సులో శతకాన్ని నమోదుచేసి
సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆ
తరువాత స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుపై
చెన్నైలోని చేపాక్ స్టేడియంలో మరో ట్రిపుల్
సెంచరీని సాధించి ఈ ఘనత సాధించిన మూడో
బ్యాట్స్మెన్గా అవతరించాడు. డాన్
బ్రాడ్మెన్ మరియు బ్రియాన్ లారాలు
మాత్రమే ఇది వరకు రెండేసి ట్రిపుల్
సెంచరీలు నమోదు చేశారు. 2009, మార్చి 11న
హామిల్టన్ వన్డేలో న్యూజీలాండ్ పై
కేవలం 60 బంతుల్లోనే సెంచరీ చేసి అతి
తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన
భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. [2]
క్రీడా జీవితం
1999 ఏప్రిల్లో పాకిస్తాన్ పై వన్డే క్రికెట్
ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో
అడుగుపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్
తొలిరోజుల్లో ఆశించినంతగా రాణించలేదు. తొలి
వన్డేలో ఒక్క పరుగుకే ఔట్ అయి, బౌలింగ్లో
కూడా 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చేశాడు.
[3] 2000 డిసెంబర్లో జింబాబ్వేతో జరిగిన
మ్యాచ్లో సెహ్వాగ్కు మరో
అవకాశం లభించింది. కాని 2001 మార్చిలో
ఆడిన తన నాలుగవ మ్యాచ్ వరకు తన
ప్రతిభను చూపలేక పోయాడు. తన నాలుగవ
మ్యాచ్లో ఆస్ట్రేలియాపై బెంగుళూరులో 54
బంతుల్లో 58 పరుగులు సాధించాడు. 3
వికెట్లకు పాట్నర్షిప్ పరుగులు సాధించి
భారత విజయానికి దోహదపడి తొలి సారిగా
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
అవార్డు పొందినాడు.[4] ఆ తరువాత
జిమ్బాబ్వే పర్యటనకు వెళ్ళిననూ అంతగా
రాణించలేడు. 2001 ఆగస్టులో శ్రీలంక,
న్యూజీలాండ్లతో జరిగిన
ముక్కోణపు పోటీలలో సచిన్ టెండుల్కర్
గాయం కారణంగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా
పంపబడ్డాడు.. [5] అదే సీరీస్లో
న్యూజీలాండ్తో జరిగిన మ్యాచ్లో
కేవలం 69 బంతులోనే సెంచరీ సాధించి
అందరినీ ఆకట్టుకున్నాడు. అదే అతని తొలి
సెంచరీ కావడం గమనార్హం. [6] అప్పటికి ఆ
సెంచరీ భారత్ తరఫున రెండో వేగవంతమైన
సెంచరీగా నమోదైంది. సహజంగానే ఆ
మ్యాచ్లో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
అవార్డు లభించింది. ఆ తరువాత భారత
జట్టులో రెగ్యులర్ బ్యాట్స్మెన్గా
చెలామణి అయ్యాడు. 2002లో కెన్యాతో
జరిగిన మ్యాచ్లో కేవలం 22 బంతుల్లోనే
అర్థసెంచరీ సాధించి భారత్ తరఫున రెండో
వేగవంతమైన అర్థసెంచరీ సాధించిన
బ్యాట్స్మెన్గా అవతరించినాడు. 2002
జనవరిలో సౌరవ్ గంగూలీ గాయపడడంతో
ఇంగ్లాండ్తో కాన్పూర్లో జరిగిమ మ్యాచ్లో
ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రంగప్రవేశం చేసి
64 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. ఆ
మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
[7] అప్పటి నుంచి సచిన్
టెండుల్కర్కు మిడిల్ ఆర్డర్ పంపించి
సెహ్వాగ్చే ఓపెనింగ్ బ్యాటింగ్ చేయించారు.
[8] ఆ తరువాత ఇంగ్లాండ్
మరియు దక్షిణాఫ్రికా సీరీస్ లలో చెలరేగి
ఆడి 4 అర్థ సెంచరీలతో 42.6 సగటుతో 426
పరుగులు సాధించాడు. 2002లో శ్రీలంకలో
జరిగిన ఐ.సి.సి.చాంపియన్ ట్రోఫీలో 90.33
సగటుతో 271 పరుగులు సాధించాడు. అందులో
రెండు పర్యాయాలు మ్యాన్ ఆఫ్ ది
మ్యాచ్ అవార్డులు పొందినాడు. ఆ సీరీస్లో
గంగూలీతో జతగా సాధించిన 192 పాట్నర్షిప్
సెంచరీ, వ్యక్తిగతంగా 104 బంతులలో
సాధించిన 126 పరుగులు కూడా ఉన్నాయి. ఆ
మ్యాచ్లో భారత్ 8 వికెట్లతో నెగ్గింది. [9]
ఆ తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో
54 బంతుల్లో 58 పరుగులు చేయడమే
కాకుండా బౌలింగ్లో కూడా రాణించి 25
పరుగులకే 3 వికెట్లు పడగొట్టి భారత్కు 10
పరుగుల విజయాన్ని అందించి భారత్
ఫైనల్లోకి ప్రవేశించడానికి దోహదపడ్డాడు.
[10]
2002 చివరిలో రాజ్కోట్లో వెస్ట్ఇండీస్తో
జరిగిన మ్యాచ్లో 82 బంతుల్లో 114
పరుగులు సాధించడమే కాకుండా గంగూలీతో
కలిసి 196 పరుగుల భాగస్వామ్య
పరుగులు జతచేసి ఆ మ్యాచ్లో భారత్కు 9
వికెట్లతో విజయాన్నిఅందించాడు. [11]
న్యూజీలాండ్తో జరిగిన 7 మ్యాచ్ల
సీరీస్లో సెంచరీ సాధించిన ఏకైక
బ్యాట్స్మెన్గా సెహ్వాగ్ అవతరించినాడు.
అందులో మొదటిది నేపియర్లో 108
పరుగులతో సెంచరీ చేయగా [12] రెండో సారి
ఆక్లాండ్లో 112 పరుగులు సాధించాడు. [13]
2003లో జరిగిన ప్రపప్చ కప్ క్రికెట్లో
సెహ్వాగ్ 27 సగటుతో 299
పరుగులు సాధించాడు. అందులో అత్యధిక
స్కోరు ఫైనల్లో ఆస్ట్రేలియాపై సాధించిన 82
పరుగులు. [14] ప్రపంచ కప్ తరువాత
హైదరాబాదులో న్యూజీలాండ్తో జరిగిన
మ్యాచ్లో 130 పరుగులు చేయడమే కాకుండా
సచిన్ టెండుల్కర్తో జతగా 182 పరుగుల
భాగస్వామ్యం జతచేసి భారత్ 145
పరుగులతో విజయం సాధించడానికి పునాది
వేశాడు. ఇది అతనికి నాలుగవ సెంచరీ కాగా ఆ
మ్యాచ్లో కూడా అతనికే మ్యాన్ ఆఫ్ ది
మ్యాచ్ అవార్డు లభించింది. [15] ఆ
తరువాత పాకిస్తాన్ , బామ్గ్లాదేశ్ మరియు
జింబాబ్వేలతో జరిగిన 22 మ్యాచ్లలో
కేవలం ఒకే ఒక సెంచరీ సాధించాడు.
2008లో ఆస్ట్రేలియా పర్యటనకై ఎంపికై
అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్సులో శతకాన్ని
సాధించాడు. ఆ తరువాత స్వదేశంలో
దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టులో మరో
సారి దక్షిణాఫ్రికాపై విరుచుకుపడి 41 ఫోర్లు,
5 సిక్సర్లతో రెండో ట్రిపుల్ సెంచరీని
సాధించాడు.[16] భారత్ తరఫున నమోదై ఉన్న
రెండు ట్రిపుల్ సెంచరీలు కూడా ఇతని పేరిటే
ఉండటం గమనార్హం. టెస్ట్ క్రికెట్లో
రెండూ ట్రిపుల్ సెంచరీలు సాధించిన వారిలీ
సెహ్వాగ్ మూడోవాడు. ఇదివరకు డాన్
బ్రాడ్మెన్ మరియు బ్రియాన్ లారాలు
మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించిన
వారిలో ఉన్నారు.
2009 న్యూజీలాండ్ పర్యటనలో తన
విశ్వరూప ప్రదర్శనతో
బౌలర్లకు చుక్కలు చూపించాడు.
హామిల్టన్లో జరిగిన నాలుగవ వన్డేలో
కేవలం 60 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి
సరికొత్త భారత రికార్డును సృష్టించాడు.
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ క్రోచే
అత్యంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్గా
ప్రశంసలందుకున్నాడు.

No comments:

Post a Comment

About

Popular Posts

Designed By Blogger Templates